తన ప్రేమొక ప్రళయం, ముంచెత్తే జలం..
తన మనసేమో హిమం, నిర్మల ఆకాశం..
తన క్రోధం బడబాణాలం, దహించే అగ్నికణం..
తన రూపం సుందరం, ప్రాకృతిక భూగోళం..
తన ఉనికి అస్పష్టం, వాయువై విశ్వవ్యాపితం..
మొత్తంగా తానే ఒక అద్భుతం..
ఆవిష్కృతమైతే అది నా అదృష్టం!
✍️సంచారి..
నేనొక సంచారిని... నా సమున్నత ఆశయాలకు సమాంతరంగా పయనించలేని ఓ నిర్విరామ పాదచారిని... ఎదలోయలోని గత స్మృతులను మరవలేని ఒంటరి భావుకుడిని... భవిష్య తీరాలు చేర కాంక్షించే బహుదూరపు బాటసారిని... నేనొక సంచారిని...