ఎక్కడికో ఈ పయనం..
ఎటువైపో నా గమ్యం...
ఎడారి దారిలోన ఏకాకిగా వెళుతున్న,
మృత్యు గుహ లోనికి ఓటమితో వెళుతున్నా...
అవమానాల అంపశయ్య పై ఆదమరచి సేద తీరుతున్నా..
అలసిన మనసుతో ఆశగా చూస్తున్నా...
ఆదుకునే ఆ అదృశ్య హస్తం ఎవరిదోనని..!
ఆర్తిగా వింటున్నా...
ఆ మృదు మధురవాణి ఏ కవిదోనని..!!
మై మరచి చూస్తున్నా...
ఆ .. అపురూప దృశ్యం ఎవరోనని..!!!
✍️సంచారి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి