సామ్రాజ్యవాదం నాటిన విషపు మొక్క మత మౌఢ్యమై ఎదిగి, ఛాందసమై విస్తరిస్తూ
మతం పేర మనుషుల ప్రాణాలను బలిగొంటే..
ప్రాణాలను చేతబట్టి పుట్టినూరు వదిలిపెట్టి
కనిపించని తీరంలో ఊహించిన భవిష్యత్తుకైకంపించే ధరణి వదిలి కల్లోల కడలి చేరే..
స్వార్ధపు ఈలోకానికి కన్నీటి సుడులు మిగిల్చి
మూడేళ్ళ ప్రాయంలో నూరేళ్లు నిండగా
శాశ్వతంగా నిదురించే సంద్రమమ్మ ఒడిలో..
చీకటి ఈప్రపంచపు నిస్తేజాన్ని దులిపి
వెలుగు రేఖలు చూపిన నిరాశ్రయ సిరియా బాలుడు
అభాగ్యుల పాలిట ఉదయించిన సూరీడు..
✍️సంచారి..
Excellent....
రిప్లయితొలగించండిThank you..
తొలగించండి