కోట్లిచ్చినా కొనలేని సంబురం
ప్రకృతి మాత ఒడిలో
సేదతీరేను చిన్ని మనసులు
గంగమ్మ తల్లి జలసిరిలో
చెంగలిచ్చే చిట్టి మనుషులు
నిండు కుండలా చెరువులు కుంటలు
అలుగు దుంకిన మత్తడి సొగసులు
పొలం మడుల మట్టి పరిమళాలు
పచ్చదనపు పంటల తోరణాలు
నీలపు నింగి నిండైన సోయగాలు
పక్షులు ప్రాణుల సొంపైన సందడులు
హరితవనాల కొండలు గుట్టలు
ఆకట్టుకునే మయూర నాట్యాలు
పల్లెతల్లి మనందరికీ ఇచ్చింది ఇన్ని వరాలు
అయినా ఆ తల్లి ఒడిని వీడి తరళి వెళుతున్నాయి కొత్త తరాలు..
✍సంచారి..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి