ఓడిన మనిషిని నేనని జాలిగా చూడకు!
ఓటమి ఒక పాఠం అని నేర్చుకునే వరకు!!
దమ్మున్నది నాకేనని రొమ్ము చూపి నడువకు!
చివరి క్షణం వరకు నువ్వు వెన్ను చూపి వెళ్ళకు!!
నమ్ముకున్న వాళ్ళని నడి సంద్రంలో వదలకు!
బరువు మోయలేక భవ బంధాలను తెంచకు!!
నేనున్నది నీతోనేనని వాగ్దానం చెయ్యకు!
మృత్యువే మన తోడుందనే వాస్తవాన్ని మరవకు!!
ఓడిన మనిషిని నేనని జాలిగా చూడకు!
ఓటమి ఒక పాఠం అని నేర్చుకునే వరకు!!
✍️సంచారి..
✍️సంచారి..
Very nice... chalaa bagundi
రిప్లయితొలగించండిThank you..😍
రిప్లయితొలగించండి