![]() |
| జయాదిత్య |
వెన్నముద్దలు ఆరగించిన చిన్ని కృష్ణుడీతడు
పూతన చనుబాలుతాగి మోక్షమొసగిన గోప బాలుడీతడు
వేణు గాన లహరిలో ఆలమందనలరించిన మురళీమోహనుడీతడు
రేపల్లె లోగిల్లలో తిరుగాడిన యశోదానందనుడీతడు
గొల్లవాడల సల్లముంతలు కొల్లగొట్టిన చోర బాలుడీతడు
కాళీయుని పీచమణిచిన తాండవకృష్ణుడీతడు
గోవర్ధనగిరినెత్తిన గోకుల గిరిధారుడీతడు
గొల్లభామల కన్నె మనసులు దోచుకున్న కొంటె బాలుడీతడు
భువిపై యెద యెదలో మధుర సుధను నింపిన శ్రీ కృష్ణుడీతడు..
✍️సంచారి..

Very nice
రిప్లయితొలగించండిThank you..😍
రిప్లయితొలగించండి