చిరునవ్వుల నీ రూపం... ఆ జాబిలమ్మకు ప్రతిరూపం
ఈ దొరసాని దరహాసం.. నా కంటికి అపురూపం
నీతో గడిపే ప్రతీ క్షణం ఎన్నెన్నో అద్భుతాల వీక్షణం
నీ వెంట నడిచే ప్రతి నిమిషం కొంగొత్త జ్ఞాపకాలకు ఉషోదయం
నా మదిలో మెదిలే నీ తలపులు
అవి నా కలత నిద్రకు కారణాలు
అవి నా కలత నిద్రకు కారణాలు
నీ జ్ఞాపకాల సవ్వడిలో రెప్ప వాల్చలేను...
నీకే చెందిన కలలో కనులు కూడా తెరవలేను!
✍️సంచారి..
✍️సంచారి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి